బీసీ కార్పొరేషన్ ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారానికి వైసీపీ గ్రామ నాయకులతో వాలంటీర్ కూడా హాజరయ్యాడు. సదస్సులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనం చేస్తుండగా బ్రహ్మంకు ఎక్కిళ్లు వచ్చి కిందపడిపోయారు. వెంటనే వైసీపీ నాయకులు అతన్ని మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. సదస్సులో పెట్టిన భోజనం వికటించడం వల్లే బ్రహ్మం చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
పోస్టుమార్టం నివేదికే కీలకం
బీసీ సదస్సులో భోజనం చేసి చనిపోయిన వాలంటీర్ బ్రహ్మం మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. భోజనం వికటించడం వల్ల జరిగిందా, మేరేదైనా కారణం వల్ల అతను చనిపోయాడా అనే విషయం పోస్టుమార్టంలో తేలనుంది. బ్రహ్మంతోపాటు భోజనం చేసిన అదేగ్రామానికి చెందిన దొండపాటి రవి కూడా వాంతులు చేసుకున్నారు. అతన్ని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతనికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు.
విషప్రయోగం కాదుకదా?
గొట్టిపడియ వాలంటీర్ బీటెక్ బ్రహ్మం మృతి చెందడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేలాది మంది బీసీ సదస్సులో భోజనాలు చేశారు. అయితే కేవలం వాలంటీర్ బ్రహ్మం, రవికి మాత్రమే వాంతులు అయ్యాయి. భోజనానికి ముందు వారు ఏమైనా ఆల్కహాల్ తీసుకున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి. దీనిపై పోస్టుమార్టం నివేదికలో స్పష్టత రానుంది.
Must Read ;- ‘బాగా బురద చల్లారా.. సర్కారీ కొలువు గ్యారంటీ’