సూపర్ స్టార్ మహేష్ బాబు.. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయాలి అనుకున్నారు. వీరిద్దరి మధ్య స్టోరీ సిట్టింగ్స్ జరిగాయి. మహేష్ చెప్పిన మార్పులు కూడా చేశాడట. దీంతో కచ్చితంగా ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అనుకున్నారు కానీ.. ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఆతర్వా త సందీప్ రెడ్డి వంగ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలి అనుకున్నారు. వీరిద్దరి మధ్య కూడా స్టోరీ సిట్టింగ్స్ జరిగాయి కానీ.. ఇక్కడ కూడా సెట్ కాలేదు.
ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలి ట్రై చేశారట. అక్కడ కూడా ఏమైందో ఏమో కానీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. టాలీవుడ్ లో, బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కి హీరో సెట్ కాక కెరీర్ లో గ్యాప్ వచ్చింది. అయితే.. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. న్యూయర్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ తన తదుపరి చిత్రాన్ని రణ్ బీర్ కఫూర్ తో చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమా టైటిల్ యానిమల్. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని తెలిసింది. మరో విషయం ఏంటంటే.. ఈ కథనే ముందుగా సందీప్ మహేష్ బాబుకు చెప్పారట. అర్జున్ రెడ్డి సినిమా వలే ఈ కథ కూడా బోల్డ్ గా ఉండడంతో మహేష్ తనకు సెట్ కాదని నో చెప్పారట. ఆ కథనే రణ్ బీర్ కపూర్ కి చెప్పగా ఓకే చెప్పాడని తెలిసింది. మరి.. మహేష్ నో చెప్పిన స్టోరీ బాలీవుడ్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.