మెరుపుతీగలాగా సన్నగా ఉండాలి.. నాజూగ్గా మల్లెతీగలాగా మెరిసిపోవాలి. నేటి తరం యువతులు, యువకుల సైతం ఇదే తరహాలో ఆలోచిస్తున్నారు. అందుకోసం తిండి మాని.. జిమ్‌ల వెంట తిరుగుతున్నారు. దీని వల్ల సన్నబడడం సంగతి పక్కనపెడితే.. రోగాలొచ్చి మంచాన పడడం ఖాయం. సన్నబడడానికి తిండి మానేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణలు. సరైన ఆహారాన్ని తీసుకుంటూ.. వ్యాయామం చేస్తే చాలంటున్నారు ఆరోగ్య నిపుణలు. మరి హాయిగా తింటూనే.. కొవ్వునెలా కరిగించాలో తెలుసుకుందాం రండి..
మిరపకాయలు
కొవ్వును కరిగించాలన్నా.. అదుపుతో ఉండాలన్నా.. కాస్త కారం తినక తప్పదంటున్నారు నిపుణులు. మిరపకాయల్లోని క్యాప్సైసిన్ అనే పదార్థం కొవ్వును కరిగింస్తుందంట.. అంతేకాదు ఒంట్లో కొవ్వు నిల్వలు చేరకుండా కూడా అదుపు చేస్తుందట. ఇక మిర్చిలోకి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మరి స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఎంత మేలు జరుగుతుందో కదా! కానీ, కారం అతిగా తినడం వల్ల అనర్థాలకు కూడా కొదవేం లేదు. కడుపులో మంట, పుండ్లు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మిరపకాయల్ని అవసరమైన మేర వాడడం మంచిది.
Must Read ;- ఈ ఆహారంతో ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోండిలా..
కమ్మని కాఫీ..
కాఫీ ప్రియలు ఈ మాట విన్నారంటే ఎగిరి గంతేస్తారు.. తమ రోజువారి అలవాట్లలో భాగంగా కాఫీ తీసుకునే వారు సన్నబడే అవకాశాలు ఎక్కువంట. కాఫీలోని కెఫిన్ ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుందట.. దీని వల్ల ఒంట్లోని కొవ్వు కరిగినట్టే కదా. కానీ, ఇక్కడే చిన్న తిరకాసు ఉందండోయ్.. కాఫీలో చక్కెరను వాడకుండా బెల్లం, తేనె లాంటివి వాడితేనే ఫలితాలు ఉంటాయట. అంతేకాదు.. వీలైతే పాలు కలుపుకోవడం కూడా మానేస్తే.. ఇంకా చాలా మంచిదంటున్నారు నిపుణలు.
Also Read ;- వేగన్స్‌కి ‘గుడ్డు’ న్యూస్..!
ప్రొటీన్ ఫుడ్ కోడి గుడ్లు..
తక్కువ ఖర్చుతో ప్రొటీన్ అందించే వాటిలో గుడ్డు ముందు వరసలో ఉంటాయని చెప్పచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా 2-3 గుడ్లు తినడం వల్ల రోజంతటకి కావాల్సిన శక్తి అందడంతోపాటు.. కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్తున్నారు నిపుణులు. కానీ గుడ్డు సొన రోజుకు 1 మాత్రమే తీసుకోవాలి. ఒకేసారి మూడు తినలేని వారు మధ్యహ్నాం, సాయంత్రం.. ఇలా పూటకొకటి కూడా తినచ్చు. దీని వల్ల చిరుతిండ్ల జోలకి పోకుండా ఉండచ్చు.
Also Read ;- నిద్రించే ముందు దంపతులు చేయకూడని పనులేమిటో తెలుసా?
గ్రీన్ టీ
ఈ మధ్య కాలంలో బరువు తగ్గాలనుకునే వారు ఎంచుకుంటన్న ఆహార అలవాట్లలో గ్రీన్ టీ ఒకటి. ఇందులోని ఇజిసిజి అనే పదార్ధం మన శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించడంలో ఉపకరిస్తుంది. రోజుకు 2-3 సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు నిండుగా అనిపించి మన తీసుకునే ఆహారం కూడా తగ్గుతుంది. దాని వల్ల బరువు తగ్గడంతోపాటు.. చెడు కొవ్వుకు చెక్ పెట్టచ్చు.
Also Read ;- ‘తల్లిపాల’ను పెంచే సూపర్ ఫుడ్స్
ఆలివ్ నూనె
ఆలివ్ నూనెతో వండే వంటకాలు ఎంతో ఆరోగ్యకరమైనవని నిపుణులు చెప్తుంటారు. ఇది మనలో చాలా మందికి తెలిసిన విషయమే. హెచ్డీఎల్ కొవ్వును కరిగించే శక్తి ఈ నూనెకు ఉందని పరిశోధనల ద్వారా వెల్లడవుతుంది. ఈ నూనెలోని ట్రైగ్లిజరైడ్స్ అనే పదార్థం కొవ్వును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం జీఎల్పీ-1 అనే పదార్థాన్ని విడుదల చేసి హర్మోన్లపై ప్రభావం చూపడం ద్వారా ఆకలిని అదుపు చేస్తుంది. ఈ నూనె వాడకం వల్ల ఆకలి అదుపు అవుతుంది. మీరు నోరు కట్టేసుకోవాల్సిన పని లేకుండానే అదుపులో ఉంచుకోవచ్చు.
Also Read ;- ఈ ఆహారంతో ప్రణాళిక లేని గర్భధారణకు చెక్ పెట్టవచ్చు
వీటితోపాటు ఇవి కూడా
- యాపిల్ సైడర్ వెనిగర్‌లోని అసెటిక్ యాసిడ్ శరీరంలోని ఫ్యాట్‌ని ఐస్ లా కరిగించగలదు.
- బ్రౌన్ రైస్ తినడం వల్ల కూడా ఆకలి అదుపు అవుతుందని చాలామందికి తెలుసు. ఆకలిని అదుపులో పెట్టుకుని బరువు తగ్గాలనుకునే వారికి ఈ బ్రౌన్ రైన్ మంచి ఎంపిక.
- కొబ్బరి నూనెతో చేసిన పదార్థాలను హాయిగా లాగించేయచ్చంటున్నారు నిపుణులు. ఇది శరీరంలో మంచి కొవ్వును పెంచడంతోపాటు చెడు కొవ్వుకు చెక్ పెడుతుంది.
- ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది. వీటిలోని ఫైబర్, కార్బోహైడ్రేట్స్ శరీరాన్ని శుద్ది చేయడంతోపాటు కొవ్వును ఇట్టే కరిగించేస్తాయి.