సంక్రాంతి అంటే కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు .. మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాల సందడి కనిపిస్తుంది. కానీ అందరి వినోద సాధనం మాత్రం సినిమానే అనిపిస్తుంది. అందువల్లనే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని చాలా సినిమాలు బరిలోకి దిగుతుంటాయి. ఈ సారి పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ, పాపం .. చేపపిల్ల తన్నుకుంటూ వెళ్లి నీళ్లలో పడినట్టుగా కొన్ని సినిమాలు థియోటర్లోకి వచ్చిపడుతున్నాయి. ఆ తరువాత హమ్మయ్య అనుకుని హ్యాపీగా ఫీలవుతున్నాయి.
అలా థియేటర్ కి వచ్చిన ‘క్రాక్’ హిట్ మార్కులు కొట్టేసి జోరందుకుంటోంది. కరోనా స్ట్రెయిన్ అంటూ వార్తలు కంగారు పెడుతున్నా, జనం లైట్ తీసుకుని థియేటర్స్ కి వచ్చేస్తున్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ, కొత్త ఏడాదిలో తొలి హిట్ ను కొట్టేసినట్టే. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ‘అల్లుడు అదుర్స్’ సినిమాతో రంగంలోకి దిగడానికి మాంఛి ఉత్సాహంతో ఉన్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది.
ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ గట్టిగానే కసరత్తు చేసినట్టున్నాడు. ఫిట్ నెస్ కోసం ఆయన పడిన కష్టం కనిపిస్తూనే ఉంది. తాజాగా వదిలిన లిరికల్ వీడియో ‘పిల్లడూ .. నీ గిల్లుడూ’లోను ఆయన చాలా ఫిట్ నెస్ తో కనిపిస్తున్నాడు. అంతేకాదు డాన్సుల్లోను మరింత రెచ్చిపోయినట్టుగా ఉన్నాడు. టాలీవుడ్ లో డాన్సింగ్ స్టార్స్ గా కనిపించే ఎన్టీఆర్ .. బన్నీ .. చరణ్ .. రామ్ పక్కన కొత్త అల్లుడు కూడా చేరిపోయేలానే ఉన్నాడు. ఈ సినిమాలో పుష్కలంగా ఉన్న మాస్ మసాలా అంశాలు చూస్తుంటే, అల్లుడికి సక్సెస్ అత్తారిల్లుగా మారనున్నట్టు అనిపిస్తోంది.
Must Read ;- ట్రైలర్ టాక్ : కామెడీ, హారర్, యాక్షన్ ప్యాక్ ‘అల్లుడు అదుర్స్’