కరోనా నివారణకు మాస్క్ పై మాస్క్ ధరించడం వల్ల మంచిదేనంటోంది కొత్త అధ్యయనం. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ జరిపిన కొత్త అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనాను కట్టడి చేయాలంటే ఒక్క మాస్క్ చాలదంట.. డబుల్ మాస్క్ ధరించడం వల్లే వైరస్ సోకకుండా అడ్డుకోగలమని సైంటిస్టులు తేల్చేశారు. మాస్క్‌లపై జరిపిన అధ్యయన ఫలితాలను JAMA ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితం చేశారు. డబుల్ మాస్క్ ధరించడం వల్ల వైరస్ కణాలు ముక్కు, నోటి ద్వారా ప్రవేశించలేవని అధ్యయనంలో తేలింది. మాస్క్‌లలో పొరల సంఖ్య పెరగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, వాటిలో ఉన్న ఖాళీలు సరిగా పూడ్చినట్టుగా ఉండి ముఖానికి బిగువుగా ఉంటేనే వైరస్ ప్రభావం నుంచి తప్పించుకోగలమని పేర్కొంది.
తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్ పరాభవం
దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.....











