రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్ని ట్రాక్ పై ఉంచిన సంగతి తెలిసిందే. వాటిలో ‘రాధేశ్యామ్’ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ‘సలార్, ఆదిపురుష్’ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ మూడూ పాన్ ఇండియా కేటగిరిలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. బహుభాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలన్నీ విడుదలకు ముందే అంచనాలు పెంచేస్తున్నాయి.
ఇక రాధేశ్యామ్ విషయానికొస్తే… జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను జూలై 31న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అలాగే.. ప్రభాస్ ఇందులో పామిస్ట్రీ పండితుడిగా నటిస్తున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో వీరిద్దరి లవ్ స్టోరీ గురించి ఓ ఆసక్తికరమైన అప్టేడ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం . ఇందులో పూజా హెగ్డే .. మెడికల్ స్టూడెంట్ ప్రేరణ గా నటిస్తోందట. ఒక యాక్సెడెంట్ లో గాయపడిన హీరో విక్రమాదిత్య .. ఆమె హాస్పిటల్ లో అడ్మిట్ అవుతాడట. కొద్ది రోజులు హాస్పిటల్ ట్రీట్ మెంట్ తీసుకొనే క్రమంలో విక్రమాదిత్య .. ప్రేరణను తొలి చూపులోనే ప్రేమిస్తాడట. అలాగే.. ప్రేరణ కూడా విక్రమాదిత్య మీద ఇష్టం ఏర్పరుచుకుంటుందట. ఈ క్రమంలో రూపొందిన లవ్ ట్రాక్ సినిమాకే హైలైట్ అవుతుందని తెలుస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో రూపొందుతోన్న రాధేశ్యామ్ .. మూవీ ప్రభాస్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- క్రేజీ తమిళ దర్శకుడితో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా?