కేన్స్ ఫిల్మ్ వేడుకలు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమ కు పండగ. అంటువంటి వేడుకల్లో పాల్గొని రెడ్ కార్పెట్ పై నడిస్తే చాలు జీవితానికి అని చెప్పుకునే వారు ఎందరో ఉన్నా కొందరికి మాత్రమే అవకాశం లభిస్తుంది. అందులోభాగంగా టాలీవుడ్ లో తన అందం అభినయం తో ప్రేక్షకుల మదిని దోచుకున్న బుట్టబొమ్మ కు అవకాశం లభించింది.రెడ్ కార్పెట్ పై నడిచి తన కలను నిజం చేసుకుంది.
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్ లో సండది చేశారు. ప్రత్యేకంగా టాలీవుడ్ నుండి బుట్టబొమ్మ తొలిసారిగా రెడ్ కార్పెట్ పై నడిచి అందరిని ఆకట్టుకుంది. తన జీవితం లో ఒక్కసారైనా లండన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్ లో పాల్గొనాలన్న తన చిన్ననాటి కోరికని తెలిపింది. అయితే ఇప్పుడు ఆ కోరిక తీరిందని ఆనందం వ్యక్తం చేసింది.బుట్ట బోమ్మ గురించి ఫిల్మ్ నగర్ లో చర్చ సాగుతోంది. ఏ ప్రాతిపధికన ఈ ముద్దుగుమ్మకు కేన్స్ వేడుకల్లో పాల్గొనే అవకాశం వచ్చిందని గుసగుసలు మొదలయ్యాయి.
75 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్ లో పాల్గొని రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం రావడం ఆనందంగా ఉందని పూజీ హెగ్డె తెలిపారు. నా దేశానికి ప్రతినిధిగా ఈ ఉత్సవం లో పాల్గొన్నాను తప్పా నటిగానో చిత్రపరిశ్రమ పేరుతోనే రాలేదని తెలిపింది. మొదట దేశానికి ప్రాతినిత్యం ఆ తర్వాత చిత్ర పరిశ్రమని వివరణ ఇచ్చింది. భారత దేశానికి ఇటు ఇండియన్ చిత్రపరిశ్రమకు ప్రాతినథ్యం వహించడం కంటే ఇంకో గౌరవడం లేదన్నారు. కేన్స్ చిత్ర వేడుకల్లో పాల్గొనాలన్న తన కల నిజమైందని సంతోషంను వ్యక్తం చేసింది. తన కేరియర్ లో ఇదే గొప్ప ఆవార్డ్ గా భావించింది. ఇంతకన్న మరొకటి లేదని తెలిపింది. అంతే కాకుండ తన కేరీర్ కు ప్లస్ అవుతుందని భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
రాధేశ్యామ్’ ‘బీస్ట్’ ‘ఆచార్య’ వంటి హ్యాటిక్ సినిమాలు ప్లాప్ తో నిరాశ కలిగిస్తే, కేన్స్ ఫిల్మ్ వేడుకల్లో పాల్గొనడం తన లో కొత్త ఉత్తేజాన్ని నింపినట్లైంది. ..