అధికార వైసీపీ పై టిడిపి నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా వైకాపా శ్రేణులు చేసుకుంటున్న సంబరాల పై ఆయన తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. మోసానికి, నమ్మక ద్రోహానికి మూడేళ్లు అంటూ కొల్లు రవీంద్ర ట్విటర్ వేదికగా విమర్శించారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన మీకు ఇదే చివరి ఛాన్స్ కాబోతుందని కొల్లు రవీంద్ర తన ట్వీట్‌లో వైసీపీని హెచ్చరించారు.ప్రభుత్వంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి అయ్యిందని వైసీపీ సంబరాలు చేసుకుంటుంటే.. ఎంత తొందరగా ఈ పీడ పోతుందో అని రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఇక మీ శేష జీవితం ఎలా బతకాలో ఈ రెండేళ్లలో చూస్కోండి అంటూ ఎద్దేవా చేశారు.ఈ ఎన్నికలు మీ పార్టీకి మీకు సమాధి కాబోతున్నాయంటూ ట్విటర్ వేదికగా వైసీపీ నాయకులను హెచ్చరించారు.
రాష్ట్రమంతా జగన్ రెడ్డి చేసిన పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చి 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా వైకాపా సంబరాల పై రాజకీయ పక్షాలతో పాటు, ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నాయని సంబరాలు చేసుకోవడం కాదు, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేశారో చెప్పాలని మండిపడుతున్నారు. అదే సమయంలో ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు అధికారం కట్టబెడితే ప్రజలపై పన్నుల భారం మోపుతూ ఇచ్చిన హామీల మేరకు అమలు చేస్తాం అన్న పథకాలు కూడా ఏదో ఒక సాకుతో కట్టిరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడప గడప కి వచ్చినప్పుడు జరిగినది చూసి కూడా సంబరాలు ఏఆ చేసుకోగలుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు.