టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులను పరామర్శించడానికి రెండు రోజులు ఆయా గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్బంగా జగన్ నిర్వాసితులకు ఇచ్చిన హామీలలోని డొల్లతనం, మాట ఇచ్చిన మడమ తిప్పిన వైనం బయటపడిపోయింది. పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు కలుస్తూ సాగుతున్న లోకేశ్.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్బంగా అక్కడి గిరిజలు నారా లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు. ముంపు గ్రామాల నిర్వాసితులు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సభకు వచ్చి వారి సమస్యలు చెప్పుకొన్నారు. అలాగే నిర్వాసితుల గూడేలలో నారా లోకేశ్ పర్యటించినపుడు తండోపతండాలుగా నిర్వాసితులు ముందుకు వచ్చి జగన్ వారికి ఇచ్చిన హామీల గురించి ఏకరువు పెట్టారు. అలాగే లోకేశ్ ఎక్కడికక్కడ నిర్వాసితులకు అండ గా ఉండి పోరాడుతానని వారిలో ధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు జగన్ ఇచ్చిన హామీలు.. వాటి పరిస్థితిని లోకేశ్ ప్రస్తావించారు. ఇలా చాలా హామీలు ఫేకేనని తేల్చేశారు.
ఫేక్ హామీలు
1. జగన్ తన పాదయాత్రలో పోలవరం నిర్వాసితుల భూములకు ఒక ఎకరాకు 19 లక్షలు నష్టపరిహారం ఇస్తానని చెప్పి తరువాత ఎన్నికల ప్రచారంలో ఒక ఎకరాకు 10 లక్షలు ఇస్తాడాని మాటమార్చారు. కానీ ఇంతవరకు వారికి ఆ పది లక్షలు కూడా ఇవ్వలేదు.
2. గతంలో ఎకరానికి 1.15 లక్షలు ఇచ్చిన భూములకు రూ 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. అది ఇంతవరకు ఇవ్వలేదు.
3. భూమి లేని వారికి 10 లక్షలు ఇస్తానని చెప్పారు. అది కూడా ఇంతవరకు అతి గతి లేదు.
4. 18 సం.లు నిండిన వారందరికీ నష్ట పరిహారం ప్యాకేజ్ ఇస్తానన్నారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు.
5. బతుకుదెరువుకు బయటికి వెళ్లినవారికి కూడా ప్యాకేజ్ ఇస్తా అన్నారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు.
6. 39 రకాల సౌకర్యాలతో నిర్వాసితులకు కాలనీలు ఏర్పాటు చేస్తా అన్నారు. ఇంతవరకు ఒకరికి కూడా ఇల్లు ఇవ్వలేదు.
7. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తా, భూమికి భూమి ఇస్తా అన్నారు. ఇది కూడా ఇవ్వలేదు.
8. పోడు భూమికి పట్టా ఇస్తానన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు.
9. ఆఖరికి చంద్రబాబు కట్టించిన నిర్వాసితుల పునరావాస కాలానికి కూడా నీటి సదుపాయం కల్పించలేదు. రోడ్లు వెయ్యలేదు.
జగన్ కపట నాటకం
ఇన్ని రకాలుగా పోలవరం నిర్వాసితులకు జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని నారా లోకేశ్ ఆరోపించారు. నాడు లక్షా తొంభై వేల మంది 5 కోట్ల ఆంధ్రుల కోసం తమ భూములు త్యాగం చేస్తే…వారందరికీ నష్ట పరిహారం కింద అనేక హామీలు ఇచ్చిన జగన్ వాటిని నెరవేర్చకపోవడం జగన్ కపట బుద్ధికి నిదర్శనమని లోకేశ్ తేల్చేశారు.











