బాలీవుడ్ దిగ్గజనం దిలీప్ కుమార్ సతీమణి సైరాభాను ఆరోగ్యం క్షీణించింది. దాంతో ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చేర్పించారు. గత జులై 7న దిలీప్ కుమార్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె చాలా కుంగిపోయినట్లు చెబుతున్నారు. దిలీప్ తో కలిసి ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేవారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమించినందువల్లే ఆస్పత్రికి తరలించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఒకవిధంగా చెప్పాలంటే దిలీప్ కుమార్ ది రెండో వివాహం.
పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దిలీప్ కుమార్ కన్నా ఈమె వయసులో 22 ఏళ్లు చిన్నది. వీరికి పిల్లలు లేరు. గోపి, భైరాగ్ లాంటి సినిమాల్లో నటించాక వీరి మధ్య ప్రేమ అంకురించింది. బాలీవుడ్ లో అగ్రతారగా ఆమె వెలుగొందింది.ది1966లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు మధుబాలతో దిలీప్ కుమార్ ప్రేమాయణం సాగింది. కానీ అది వివాహానికి దారితీయలేదు. తర్వాత ఆస్మా రెహ్మాన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితం 51 ఏళ్లు అయిన సందర్భాంగా ట్వట్టర్ ద్వారా వీరి భావాలను పంచుకున్నారు.
దిలీప్ అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ప్రతిసారీ ఆయనకు ఆమె ఎంతో సేవలందించారు. భర్త ఎక్కడ ఉంటే ఆమె అక్కడే ఉండేవారు. సాధారణంగా సినిమా తారలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత అభిప్రాయభేదాల కారణంగా విడిపోయినవారు ఎక్కువ. కానీ వీరి విషయం అలా కాదు. పెళ్లి చేసుకున్నప్పుడు అనేక విమర్శలు వచ్చినా జీవితం చరమాంకం వరకూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ దంపతులయ్యారు. ఆస్పత్రిలో ఉన్న సైరాభానును కుటుంబ సన్నిహితులు దగ్గరుండి చూసుకుంటున్నారు.











