మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా… అయితే ఇక మీద నుంచి జాగ్రత్త ఉండండి. ‘దూర ప్రయాణమే కదా.. సరదాగా ఒక సిగరేట్ తాగేదాం’ అనుకుంటే ఇక నుంచి చెల్లదు. ఇంతకముందు రైళ్లలో సిగరేట్ తాగినట్టు రుజువు అయితే, జరిమానాలు విధించేవాళ్లు అధికారులు. తాజాగా రైల్వేశాఖ కఠిన నిబంధనలు అమలు చేయనుంది. రైళ్లలో పొగ తాగినట్లు తెలిస్తే ఏకంగా జైలుకు పంపనుంది. ఈ రూల్స్ త్వరలోనే అమలుకానున్నాయి. సో పోగరాయుళ్లు కాస్తా జాగ్రత్త మరి.
గత పది రోజుల క్రితం న్యూఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్5 బోగీకి ప్రమాదవశాత్తు మంటలంటుకున్న విషయం అందిరికీ తెలిసిందే. ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై అధికారులు విచారణ చేపట్టగా ప్రయాణికుల్లో ఒకరు సిగరెట్ లేదా బీడీ కారణమని ప్రాథమిక నివేదిక వెల్లడైంది. రైళ్లలో ధుమపానం చేసే వ్యక్తులకు భారీ జరిమానా విధించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అరెస్టులు సైతం చేయాలని భావిస్తోంది. జరిమానాలతో సరిపెట్టిన అధికారులు త్వరలో కఠిన చట్టాలు అమలు చేయనున్నారు.