ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సైలెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. వేల కోట్ల నగదు మళ్లింపు గురించిన వివరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ నుంచి ఈడీకి అందాయి. ఇప్పటికే డిస్టిలరీల యజమానులను పిలిచి ..వాటిని ఈడీ నిర్ధారించుకుంది. లంచాలు ఇచ్చారని వారిపై పెద్దగా చర్యలు ఉండవని..నిక్కచ్చిగా నిజాలు చెప్పి, ఆధారాలు ఇస్తే..అసలు దొంగల్ని మాత్రం పట్టుకుంటామని ఈడీ భరోసా ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.
లిక్కర్ స్కామ్‌లో డిస్టిలరీల నుంచి వసూలు చేసిన నగదుతో పాటు టాక్స్‌లు కట్టకుండా అమ్మిన మద్యం, లెక్కల్లోకి రాని అమ్మకాల ద్వారా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఆ డబ్బును వివిధ మార్గాల్లో వైట్ చేశారు. ఆ మార్గాలన్నింటినీ ఈడీ ఇప్పటికే గుర్తించింది. డబ్బులు చిన్న మొత్తంలో కాదు వందల కోట్లలో లావాదేవీలు జరగడంతో ఈజీగా దొరికిపోయారు.
ఇప్పటికే లిక్కర్ స్కాంలో కీలక ఆధారాలన్నీ వెలుగులోకి వచ్చాయి. చాలా మంది అప్రూవర్లుగా మారుతున్నారు. అసలు నిజాలు చెబుతున్నారు. ఆ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవడమే మిగిలి ఉంది. ఈడీ ఆ పని చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలో పెద్ద ఎత్తున ఆస్తులను ఎటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈడీ చర్యలు ప్రారంభిస్తే లిక్కర్ స్కామ్‌లో ప్రకంపనలు మొదలుకానున్నాయి.











