మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 4న టీఆర్‌ఎస్‌ను వీడి,హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.మూడు రోజుల నుంచి ఢిల్లీలోని జాతీయ నాయకులను కలుస్తున్న ఆయన బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్‌తో బుధవారం సమావేశమయ్యారు.తొలుత ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి తర్వాత మంచిరోజు చూసుకుని బీజేపీలో చేరతానని ఈటల వెల్లడించినట్లు సమాచారం.గురువారం హైదరాబాద్ చేరుకోనున్న ఈటల తన భవిష్యత్తు కార్యాచరణను రేపు విలేకరుల సమావేశంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- ‘తమ్ముడూ అభినందనలు’.. బీజేపీలో ఈటల చేరికపై విజయశాంతి