మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారనే విషయం విధితమే. ఇప్పటికే ఆయన బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతుండటంతో.. ఆయన చేరిక దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే. ఆయనపై అనర్హత వేటు వేయడానికి టీఆర్ఎస్ నాయకత్వం సిద్ధమవుతోంది. వేటు వేసేందుకు అసెంబ్లీ స్పీకర్ ను కోరనున్నట్లు తెలుస్తోంది. ఈటల బీజేపీలోకి చేరగానే.. లిఖితపూర్వకంగా కోరనున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ లోనే కొనసాగుతూ బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న ఈటెలపై పార్టీ నేతలతో సహా సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. ఈటల బీజేపీ చేరికపై ఇతర పార్టీల నాయకులు కూడా విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Must Read ;-టీఆర్‌ఎస్‌కు రేపు ఈటల గుడ్ బై..











