ఈ నెల 7వ తేదీ అంటే సోమవారం నుంచి ఆనందయ్య మందును ఆన్‌లైన్‌లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ ప్రకటించారు.ఆనందయ్య మందు కోసం జనం వేలాది మంది ఒకేసారి కృష్ణపట్నం తరలిరావడంతో అక్కడ అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.క్యూలైన్లలో సామాజిక దూరం కూడా పాటించడం లేదు.దీంతో కరోనా వ్యాపించే ప్రమాదం ఉండటంతో ఈసారి ఆనందయ్య మందును ఆన్ లైన్ ద్వారా మాత్రమే సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు వెబ్ సైట్‌తో పాటు,మొబైల్ యాప్,కాల్ సెంటర్ ఏర్పాటుకు కూడా చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.
సీవీఆర్ కాంప్లెక్స్‌లో తయారీ
కృష్ణపట్నం ఓడరేవుకు చెందిన సీవీఆర్ కాంప్లెక్సులో ఓ భవనాన్ని ఆనందయ్య మందు తయారీకి కేటాయించారు.గత రెండు రోజుల నుంచి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే కొన్ని మొక్కల ఆకులు సేకరించడం కష్టంగా మారింది. దీంతో ఆనందయ్య మందును పెద్ద ఎత్తున తయారు చేయడం సాధ్యం అవుతుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. ముందుగా కరోనా సోకిన వారికి మందు అందజేయాలని నిర్ణయించారు.అయితే ఆనందయ్య మందు కోసం ఎవరు కూడా కృష్ణపట్నం రావద్దని కలెక్టర్ విజ్ఙప్తి చేశారు.పొరుగు రాష్ట్రాల వారికి కావాలన్నా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి కొరియర్,పోస్టు ద్వారా పంపిస్తామని ఆయన వెల్లడించారు.
చుక్కల మందుకు దక్కని అనుమతి
కరోనా రోగులకు కంట్లో వేసే చుక్కల మందుకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు.ఆనందయ్య తయారు చేస్తున్న మందుల్లో కంట్లో వేసే చుక్కల మందే కీలకం కావడంతో,ఆ మందుకు అనుమతి కోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే మందు పంపిణీ ప్రారంభించేందుకు ఆనందయ్య టీమ్ ఏర్పాట్లు చేస్తోంది. మందుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ రావడంలో ఉప రాష్ట్రపతి చేసిన సాయం మరువలేనని ఆనందయ్య కృతజ్ఙతలు తెలియజేశారు.
Must Read ;- ఆనందయ్య.. మనకు దేవుడి ఇచ్చిన వరం : కేఏపాల్ కామెంట్స్











