అందంగా ఉంటే సరిపోదు. ఆ అందాన్ని మరింత అందంగా ప్రదర్శించడం రావాలి. అయితే ఆ ప్రదర్శనలో హద్దులు, ఆంక్షలు ఉండకూడదనేది ఆ బ్యూటీ థీరీ. అందుకేనేమో అమ్మడు కుర్రకారుకు అస్సలు నిద్రపట్టనీయకుండా చేస్తోంది. ఆమె పేరు మాళవికా శర్మ. మోడలింగ్ ప్రపంచం నుంచి వెండితెరమీద గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. క్యూట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆ సుందరి.. ఇప్పుడు ఇన్ స్టా కే ఆకర్షణగా మారింది.
నేలటిక్కెట్టు , రెడ్ సినిమాల్లో తనలోని గ్లామర్ కోణాన్ని ఎలివేట్ చేసింది మాళవికా శర్మ. తొలి రెండు సినిమాలు ఆశించిన రీతిలో ఆడకపోయినప్పటికీ.. అందాల ప్రదర్శనలో ఆమె మాస్టర్ డిగ్రీ తీసుకుంది. క్లీవేజ్ షోస్ నుంచి స్కిన్ షో వరకూ ఎలాంటి మొహమాటాలు లేకుండా.. సోషల్ మీడియా వేదిక గా ఎగ్జిబిట్ చేయడం తన హాబీగా పెట్టుకుంది.
ఇటీవల లా పట్టభద్రురాలు అయిన మాళవికా శర్మ.. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన పిక్స్ .. నెటిజెన్స్ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చీరకట్టులో మెరుపు తీగెలా తళుక్కున మెరిసిన ఆమె.. ఇతర ఫ్యాషన్ డ్రెసెస్ లోనూ సత్తా చాటుకుంది. ప్రస్తుతం ఆమె హాట్ పిక్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. వీటివల్లనైనా ఆమె మరిన్ని అవకాశాల్ని అందుకుంటుందని ఆశిద్దాం.
Must Read ;- బికినీ షో తో రెచ్చగోడుతోన్న బాలీవుడ్ బ్యూటీ