Electricity Workers Protest In Front Of Minister Balinenis House
మా డిమాండ్స్ పరిష్కరించండి!
ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మీటర్ రీడర్స్ సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద బుధవారం నిరసనకు దిగారు ఉద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా 4,600 మంది మీటర్ రీడర్స్ గత 15 ఏళ్లుగా స్పాట్ బిల్లింగ్ వర్క్ చేస్తున్నారు. మీటర్ రీడర్స్ పనిదినాలు కుదింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, ఏపీడీసీఎల్ పరిధిలో 15 శాతం సర్వీసులు రీడింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులతో చేయించాలనే ఉత్తర్వుల రద్దు వంటి అనేక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పాదయాత్రలో మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అనేక ఏళ్లుగా ఉన్న డిమాండ్స్ ను ప్రభుత్వం తాత్సారం చేస్తున్నారని ఆగ్రహించిన ఉద్యోగులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించి, నిరసన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తుంటే విధులనుంచి తప్పించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు నుంచి ధర్నా చేస్తున్న పట్టించుకోవడంలేదని, సమస్యలను పరిష్కరించాలని ఆందోళన వ్యక్తం చేశారు.
Electricity Workers Protest In Front Of Minister Balinenis House
Must Read ;- ఇక నమ్మరు జగన్ ..! ఉద్యమ బరిలో నువ్వా-మేమా