సమ్మె సైరన్ కు ఉద్యోగ సంఘాలు సన్నద్ధం !
ప్రభుత్వ పథకాలు కార్యరూపం దాల్చాలన్నా.. అవి ప్రజలకు చేరాలన్నా .. మనిషి పుట్టినకాడి నుంచి గిట్టే వరకు ప్రభుత్వాధికారులది చాలా కీలక పాత్ర. చివరగా .. మనిషి దైనందిన జీవితంలో ప్రభుత్వ ఉద్యోగుల కూడా ఒక భాగమే. అటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఏపీలో నిర్లక్ష్యానికి గురౌతున్నారు. వారి బాధలు ఎవరికి చెప్పుకుంటారు. నమ్మి రెండు చేతులతో ఓట్లేసిన పాపానికి ముఖ్యమంత్రి కంటికి కనిపించడు. గోడు వినడు. ఎంతో చిన్నచూపుకు గురైతే తప్పా .. ప్రభుత్వం ఉద్యోగులు రోడ్డెక్కారు. అటువంటిది జగన్ రెడ్డి చర్యలు ఉద్యోగులను తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. 11వ పీఆర్సీ ఇచ్చేవరకు నిరసనలను విస్మరించేది లేదని చివరాఖరుకు గుర్తించిన ఏపీ జేఏజీ, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఐక్యకార్యచరణ సమితిగా ఏర్పడి సీఎస్ సమీర్ శర్మకు బుధవారం సమ్మె నోటీసు అందించారు.
ఇవ్వాల్సినవి ఇవే .. ఇవ్వకుంటే కష్టం!
ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వారి దాచుకున్న డబ్బులు కూడా లాగేసుకుంది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఏపి ఉద్యోగ సంఘాలు. పీఆర్సీ సహా డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, గడిచిన మూడేళ్లల్లో చనిపోయిన 5 వేల మంది ఉద్యగులకు సంబంధించిన కారుణ్య నియామకాల భర్తీ ఇలా అనేక సమస్యలను తక్షణమే పరిష్కరిచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 7 నుంచి ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలతో పాటు విశాఖ, తిరుపతి, ఏలూరు, ఒంగోలు నగరాల్లో డివిజన్ స్థాయి సదస్సులు నిర్వహించేందుకు ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
Must Read ;- విధ్వంసకర ఆర్థిక వ్యవస్థ!