మేధావులు మండిపడుతున్నారు .. !
ఏపీలో మేధావులు మండిపడుతున్నారు. జగన్ రెడ్డి పాలనలో జరుగున్న అవినీతి, ధనార్జన యజ్ఞం పై సీనియర్ రాజకీయవేత్తలు, మేధావులు పెదవి విరుస్తున్నారు. శనివారం జగన్ రెడ్డి పాలనా వైఫల్యాలను మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమర్ ప్రశ్నించారు. ఒక్కింత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ .. ఒక రెంజ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాలన అట్టర్ ప్లాప్ దశగా సాగుతోంది. జగన్ ఇలాకలో అవినీతి రాజ్యమేలుతోంది. పొరుగు రాష్ట్రాల్లోని సీఎం లను చూసైనా నేర్చుకో జగన్ అని సూటిగా విమర్శలు ఎక్కుపెట్టారు ఉండవల్లి.
అప్పులు కోసం ఇంత దిగజారిన సీఎంను ఎక్కడ చూడలేదు …
ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తోందని ఉండవల్లి మండిపడ్డారు. అప్పుల కోసం ఇంత దిగజారి అన్నింటినీ ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఇలానే చేసుకుంటూపోతే భవిష్యత్ లో ఏపీ అప్పలు తీసుకుని పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సహా ముఖ్య అంశాలను ఏమి చర్చించలేదని, చర్చించాల్సిన అంశాలను చర్చించకుండా సభను పక్కదోవ పట్టించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విపక్ష లేకుండా ఏం చర్చిస్తారని ఆయన వాపోయ్యారు.
జగన్ వ్యాపార అప్పుల కోసమే .. రాష్ట్రం అప్పులు పాలు!
రాష్ట్రం కార్పోరేషన్ ల గ్యారంటీ పరిమితిని 90 శాతం నుంచి 180 శాతానికి పెంచిందని ఆరోపించారు ఉండవల్లి. జగన్ అండ్ కో వ్యాపారాలకు సంబంధించిన అప్పులు తీర్చుకొని, కానీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని విమర్శించారు. నేటికి ఏపీ రూ. 6 లక్షల 22 వేల కోట్ల అప్పుల్లో ఉందని గుర్తు చేశారు. జగన్ వచ్చాక రూ. 3 లక్షల 50 వేల కోట్లు అప్పులు చేశారని లెక్కల్లో ఆయన వివరించారు. గవర్నెస్ అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా విఫలమయ్యారని, ముఖ్యమంత్రి గుండె మీద చేయి వేసుకుని అవినీతి రహిత పాలనపై మాట్లాడగలరా? అని ప్రశ్నిచారు. ఏపీలోని ఐఏఎస్ అధికారులే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేతులెత్తేస్తున్నారని చెప్పారు. జగన్ పాలనపై రాజమండ్రిలో ఉండవల్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యక్ష్యంగానే చురకలు అంటించారు.