విమర్శలకు బూతులకు తేడా తెలియని పోలీసులు!
జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను విమర్శిస్తే చాలు.. ఇక అరెస్ట్ లే? విపక్షాలు విమర్శలను సూచనలుగా భావించే మనస్తత్వం లేని సీఎంగా జగన్ రెడ్డి ఉండటం ఏపీ ప్రజలు, విపక్షాలు చేసుకున్న పాపం!!బూతులకు, విమర్శలకు ఎంత పెద్ద తేడా తెలియకే.. ఆయన పార్టీ పతాక స్థాయిలో ప్రజాస్వామ్యంలో పతనమౌతున్నా నేటికి జ్ఞానోదయం కావడంలేదు. ‘‘కర్ణుడి చావుకు పదివేల కారణాలు అన్నట్లు.. జగన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఛీదరించుకోవడానికి ప్రజా ప్రతినిధులు, బూతుల మంత్రులే ప్రధాన కారణం.’’ జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను, లోపాలనే అంగీకరించని ప్రజలు.. ప్రజాప్రతినిధులు వాడే భాషను డే వన్ నుంచే ఆక్షేపిస్తున్నారు. కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, సీదిరి, అంబటి, ద్వారంపూడి వంటి వారు చాలు జగన్ రెడ్డి పార్టీని సర్వనాశనం చేయడానికి అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. అధిష్టానానికి కనువిప్పు కలగడంలేదు! ‘‘గుడివాడ – గోవా’’ విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి, అధికార పార్టీకి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది!! గుడివాడలో గోవా కల్చర్ ను తీసుకోచ్చారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటే.. బూతులకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరున్న మంత్రి కొడాలి సచివాలయం సాక్షిగా చెవుల నుంచి రక్త వచ్చేలా చంద్రబాబు, లోకేశ్, బోండా, బుద్ధా లను తిట్టిపోశారు. మరి ఆ మాటలు చట్టాలకు వినిపించడం లేదేం? చుట్టాలుగా మారిన సందర్భంగా మంత్రి వాడే బూతులు కాస్తా చెక్కభజనలా వినిపిస్తున్నాయా ఏంటి? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
మంత్రు నోటికొచ్చినట్లు తిడితే కేసులు లేవా?
అధికారం, మంత్రి పదవీ చేతులో ఉంది కదా అని కొడాలి నాని నోటికి ఎంతమాటోస్తే అంతా మాట మీడియా ముందు మాట్లాడితే.. ప్రజలు హర్షించరు! అంతేకాదు ఆయన కొనసాగుతున్న పార్టీని కూడా ప్రజలు క్షమించరని అత్యంత త్వరలో వైసీపీ అధినేత జగన్ రెడ్డి తెలుసుంటాడు!! అధికారం చేతిలో ఉందని కొడాలి నాని చంద్రబాబు,లోకేష్ ను నోటికొచ్చినట్లు పచ్చిబూతులు మాట్లాడినా.. ఆయనపై ఎటువంటి కేసులు నమోదు చెయ్యారు. ఫిర్యాదు చేసినా.. కనీసం తీసుకోరు! రాజ్యాంగంలో ప్రజాప్రతినిధులకు బూతులు మాట్లాడేందుకు ప్రత్యేకించి ఏమైన స్పెషల్ వెసులుబాటు కల్పించారా? లేక అధికారపార్టీ జోలికి చట్టాలు వెళ్లావా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పరుషపదజాలం, బూతులు వంటివి టీడీపీ నాయకుల నోటవెంట చూద్దామన్నా మచ్చుకైన వినిపించవు! అదే అధికార వైసీపీ నేతల నుంచి మాటకు ముందు, తరువాత వచ్చేవి బూతులే! దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశ రాజకీయాలను బూతులతో అత్యంత ప్రభావితం చేసిన రాజకీయ పార్టీ, నేతలు ఎవరైనా ఉన్నారంటే.. అది వైసీపీ, ఆ పార్టీ నాయకులే అని గూగుల్ సెర్చ్ లో అడిగిన తేటతెల్లమౌతోంది! కొడాలి నాని, డీజీపీ పై వ్యతిరేకంగా బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే బుద్ధా వెంకన్న ఇంటికి వెళ్లి, అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ ను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? బుద్ధా చేసింది కేవలం వ్యాఖ్యలేనని, మరి బూతుల మంత్రి కొడాలి నాని వాడిన నీచమైన భాషకు ఆయనపై చర్యలేమి లేవా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్, పార్టీ ముఖ్యనేతలు ప్రశ్నిస్తున్నారు.
Must Read:-జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ దండయాత్ర..!