పిల్, పిటిషన్లపై నిర్ణయాధికారం మాకు లేదు..!
ఉద్యోగుల పీఆర్సీపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. పిల్, పిటిషన్లను విచారించి, నిర్ణయం తీసుకునే అధికారం తమ బెంచ్ లేదని డివిజన్ బెంచ్ వెల్లడించింది. పిటిషన్ విచారించే రోస్టర్ లో తమ బెంచ్ కు లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వ్యక్తిగత పిటిసన్ అవటంతో.. నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పీఆర్సీ సవాలు పిటిషన్ సీజేకు పంపుతున్నట్లు న్యాయమూర్తి అన్నారు. ఏపీలో ఉన్న అందరి ప్రయోజనాలు పిటిషన్ ముడిపడి ఉన్నాయన్నాని న్యాయస్థానం అభిప్రాయపడ్డింది. కాగా విచారణ స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరు కాలేదని ప్రశ్నించారు.
నోటీస్ లేకుండా జీతాల్లో కోత విధించడం చట్టవిరుద్ధం!
నోటీస్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం చట్టవిరుద్దమని పిటిషనర్ తరుఫున న్యాయవాది వాదించారు. పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సోమవరం హైకోర్టు విచారణ చేపట్టింది. నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్ తరుఫున న్యాయవాది వాదించారు. వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణ వచ్చే సోమవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. స్టీరింగ్ కమిటీలోని 12 మంది సభ్యుల కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. మరోవైపు ఉద్యమ కార్యచరణకు ఉద్యోగులు అడుగులు వేస్తున్నారు. రేపటినుంచి నిరసన, ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా.. ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు.
Must Read:-చంద్రబాబు మెతక వైఖరి వీడితే… ఏ ఒక్కరూ మిగలరు : వైసీపీ ప్రభుత్వంపై గౌతు శీరిష ఫైర్