మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ మచిలీపట్నంలో ప్రచారం నిర్వహించారు. రెండు సంవత్సరాల్లోనే లక్షన్నర కోట్లు అప్పులు చేసి సీఎం జగన్ రెడ్డి రికార్డు సృష్టించారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు పింఛను పెంచుకుంటూ పోతానని చెప్పిన జగన్ రెడ్డి, పింఛన్లు పెంచకపోగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పెంచుకుంటూ పోతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పట్టణాలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పడకేసిందని ఆయన విమర్శించారు. వైసీపీ గెలిస్తే ఇంటి పన్నులు 5 రెట్లు పెంచడానికి సిద్దంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
బియ్యం డోర్ డెలివరీ పేరుతో రూ.1250 కోట్లు వృథా
సన్నబియ్యం ఇస్తానని చెప్పిన సన్నాసి మంత్రి ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీ అంటున్నాడని నారా లోకేష్ విమర్శించారు. బియ్యం డోర్ డెలివరీ అంటే మన డోర్ వద్ద అనుకున్నాం కానీ, రేషన్ బండి డోర్ వద్ద గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. గడచిన రెండేళ్లలో మచిలీపట్నంలో వైసీపీ వారు చేసిన అభివృద్ధి పనులు ఒక్కటన్నా ఉంటే చూపాలని లోకేష్ సవాల్ విసిరారు. టీడీపీని గెలిపిస్తే ఒక్క రూపాయి పన్నులు పెంచకుండా పాలన సాగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు నారా లోకేష్ విజ్ఙప్తి చేశారు.
Must Read ;- పరిశ్రమలను వెనక్కు పంపిన ఘనత వైసీపీ సర్కారుది : నారా లోకేష్