Ex Deputy CM Damodara Rajanarsimha Injured During Congress Party Protest Rally :
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. మెదక్ జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమానికి ఎడ్లబండ్లని ప్రదర్శనగా తీసుకొచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎండ్లబండి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తన ప్రసంగంలో భాగంగా ‘జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్’ అని నినాదాలు చేయడంతో ఎడ్లు ఒక్కసారిగా బెదిరాయి. దీంతో ఎండ్లబండి కుదుపులకు గురికావడంతో రాజనర్సింహ కిందపడిపోయాడు. ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించడంతో మోకాలికి దెబ్బ తగినట్టు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వరంగల్, నిర్మల్, మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, జగ్గారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
Must Read ;- కేటీఆర్‌పై రేవంత్ పైచేయి.. ఎలాగో తెలుసా?