వరంగల్ అర్బన్ జిల్లా పేరు మారిపోయింది. ఇకపై ఈ జిల్లాను హన్మకొండ జిల్లాగా పిలుస్తారు. వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పరిగణిస్తారు. ఈ మేరకు కేసీఆర్ తన వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కొత్త పేర్లను ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ జిల్లాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని కూడా కేసీఆర్ ప్రకటించారు.
10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలుగా మార్పు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత… పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎంగా టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదవీ బాధ్యతలు చేపట్టారు. పాలనలో తనదైన మార్కును చూపుతూ సాగిన కేసీఆర్… ప్రజా పాలనను మరింత సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పది జిల్లాల తెలంగాణను తొలుత 31 జిల్లాలుగా ఆ తర్వాత 33 జిల్లాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేశారు.
వరంగల్ రూరల్ లో ‘రూరల్’ లేదు
ఈ క్రమంలో వరంగల్ జిల్లాను రెండుగా విభజించిన కేసీఆర్ సర్కారు… వరంగల్ అర్బన్ ప్రాంతాన్ని అదే పేరిట వరంగల్ అర్బన్ జిల్లా అని, రూరల్ ప్రాంతాన్ని వరంగల్ రూరల్ జిల్లా అని మార్చేశారు. ఇప్పటిదాకా ఈ పేర్లతోనే పాలన సాగింది. తాజాగా వరంగల్ పర్యటనకు వచ్చిన కేసీఆర్… ఈ జిల్లాల పేర్లను మారుస్తూ వరంగల్ అర్బన్ జిల్లాకు హన్మకొండ అని, వరంగల్ రూరల్ జిల్లాకు వరంగల్ జిల్లాగా పేర్లు మారుస్తూ ప్రకటన చేశారు.
Must Read ;- కేసీఆర్ టూర్ లో కరపత్రాల కలకలం.. పార్టీ నేతల్లో గుబులు