మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఈమధ్యనే ఆయన కరోనా బారిన పడ్డారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అయితే నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, డాక్టర్లు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కొంతకాలంగా రాష్ర్ట రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఆయన. టీడీపీకి దూరమైన తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరాలని అనుకున్నారు. కానీ, కేసీఆర్ నుంచి ఎటువంటి పిలుపు లేకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Must Read ;- ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్‌కు కరోనా పాజిటివ్…











