ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కరోనా భారిన పడ్డారు. వారం రోజులుగా ఆయన హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. వెలగపూడి సచివాలయంలో ఇప్పటికే 60 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. ఇవాళ ఆర్థిక శాఖలో ఓ ఉద్యోగి కరోనా భారిన పడి మరణించారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. అయితే వారం రోజులుగా ఆయన తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్నారని తెలుస్తోంది. దీంతో కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారనే విషయం ఇవాళ వెలుగులోకి వచ్చింది.
విజయవాడలో స్వచ్ఛందంగా లాక్ డౌన్
విజయవాడలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం వ్యాపార, వాణిజ్య సముదాయలు అన్నీ మూసివేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక సోమవారం నుంచి శనివారం వరకు షాపులు సాయంత్రం 6 గంటలకల్లా మూసి వేయాలని నిర్ణయించారు. ఏపీలో రోజుకు 5 వేల కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టులు సంఖ్య పెంచితే కోవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Must Read ;- ఏపీ సచివాలయంలో కరోనా కలకలం











