పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కరోనా బారిన పడ్డారనే విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయం క్షేత్రంలో పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జ్వరం, ఒళ్లునొప్పులు, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడంతో పవన్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఆయనకు వైద్యులు వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స అందిస్తున్నారు. యాంటివైరల్ మందులతో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు. అయితే పవన్ త్వరగా కోలుకోవాలంటూ తెలుగు రాష్ర్టాల్లో అభిమానులు పూజలు చేస్తున్నారు. వైరస్ నుంచి బయటపడాలంటూ హోమాలు, పూజలు, వ్రతాలు చేస్తున్నారు. తూర్పు గోదావరి, గన్నవరం, గుంటూరులోని ఆయన అభిమానులు, జన సైనికులు పూజలు చేశారు.
Must Read ;- ఐసీయూ లో బండ్ల గణేశ్.. కరోనా పాజిటివే కారణమా?











