సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే ప్రకాశం జిల్లా ఎస్పీ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఫేస్ బుక్ ఖాతా ప్రారంభించి డబ్బులు డిమాండ్ చేశారు. మొదట పలువురికి స్నేహ అభ్యర్థనలు పంపి fb లో యాడ్ చేసుకున్న తర్వాత.., మెసెంజర్‌లో చాటింగ్ చేస్తూ తనకు అత్యవసరమని, డబ్బులు సర్దుబాటు చేయాలని విన్నపాలు పంపించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. జిల్లా పోలీసు బాస్ పేరిటే ఏకంగా ఖాతా తెరిచి మోసానికి ప్రయత్నించడాన్ని ఆ శాఖ సీరియస్‌గా పరిగణించి…, నిందితుడి ఆచూకీ కోసం వేట మొదలెట్టింది.

స్పందించిన ఎస్పీ…!
నకిలీ ఫేస్ బుక్ ఖాతాల వ్యవహారం బయటకు రాగానే జిల్లా పోలీసు కార్యాలయం స్పందించింది. ఎస్పీ కౌశల్ తాను స్వయంగా నిర్వహించే ఖాతా నుంచి ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. నకిలీ ఖాతా, అందులోని ప్రొఫైల్ ఫొటోల స్క్రీన్‌షాట్లను పోస్ట్ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సంప్రదించి ఖాతాను మూసివేయించారు.
Must Read : Breaking: చీరాల వైసీపీ ప్రతిరోజూ రావణ కాష్టమే!
ఇలా వెలుగులోకి వచ్చింది…!
సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎప్పుడు అయితే డబ్బులు ఎస్పీ పేరుతో ఆడిగారో.., అప్పుడే కొందరు అకౌంట్ ని బ్లాక్ చేశారు. కానీ, ఇంకొందరు ఇది ఫేక్ అకౌంట్ అని, ఎస్పీ పేరుతో డబ్బులు డిమాండ్ చేశారని.., పోలీసు శాఖ ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబరు 9121102266ను సంప్రదించారు. కమాండ్ కంట్రోల్‌లో పనిచేస్తున్న అధికారులు ఈ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎస్పీ కౌశల్ తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాల మేరకు కమాండ్ కంట్రోల్ ఎస్సై కె.అజయ్‌కుమార్ తాలూకా పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీంతోపాటు…, పొదిలి సీఐ శ్రీరామ్ పేరిట కూడా ఇదే తరహాలో మరో నకిలీ ఖాతా దర్శనమిచ్చింది. పోలీసు అధికారుల పేర్లు, వారి ఫొటోలతోనే ఖాతా తెరిచిన దుండుగుడు స్నేహ అభ్యర్థనలు పంపుతూ నగదు అడగటం కూడా వెలుగులోకి వచ్చింది.
Also Read: టార్గెట్ సీఎం & పీఎం : పోటెత్తనున్న సోషల్ పోరాటం










