గుంటూరు జిల్లా వినుకొండలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. వినుకొండ సమీపంలోని వెంకుపాలెం, విఠంరాజుపల్లి ప్రాంతాల నుంచి ప్రతి రోజూ 500 ట్రాక్టర్ల మట్టి తరలిపోతోంది. వైసీపీ నేతల అండతో కనీసం నెంబర్లు ప్లేట్లు కూడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో మట్టి తరలిపోతున్నా గనుల శాఖ అధికారులుగానీ, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కన్నెత్తి చూడటం లేదు. మట్టి మాఫియా నడుపుతున్న వారికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అండదండలు ఉన్నాయనే మాట స్థానికంగా వినిపిస్తోంది. దీంతో వారి అరాచకాలకు అడ్డేలేకుండా పోతున్నదని అనుకుంటున్నారు.
అక్రమార్కులు వారు కొల్లగొట్టిన సంపదలో కొంత భాగం అధికారులకు కూడా ఎప్పటికప్పుడే వారి వారి వాటాలు ముట్టజెపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే మూడు శాఖల అధికారులు నిద్ర నటిస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
Must Read:https://www.theleonews.com/ysrcp-mp-works-along-with-tdp-leader/
అన్న ఫోటో అంటిస్తే చాలు
ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో స్టిక్కర్లను అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లకు అతికించి, మేము అధికార పార్టీ వారిమని అక్రమార్కులు చెప్పకనే చెబుతున్నారు. అన్ని శాఖల అధికారులతో ముందే ఒప్పందం చేసుకోవడంతో రాత్రి 11 గంటల తరవాత తిప్పుకోవాలని అనధికారికంగా అధికారులు సలహా ఇచ్చారని తెలుస్తోంది.
రాత్రి 11 అయితే జన సంచారం దాదాపుగా తగ్గిపోతుంది. ఇక అక్రమార్కులు అప్పడే పని మొదలు పెడతారు. ఉదయం ఆరు గంటల వరకు ఇక మట్టి మాఫియా ట్రాక్టర్లు చీమలదండులా ఒకదాని వెంట మరొకటి రొద పెడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఏదైనా అర్జెంట్ పనిఉండి బయటకు రావాలంటే భయమేస్తోందని ప్రజలు ఆందోళనతో చెబుతున్నారు. అయినా అధికారులకు ఇవేమీ పట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మట్టికెందుకంత డిమాండ్
వినుకొండ పట్టణంలో గృహనిర్మాణాలకు ఎత్తు లేపేందుకు మట్టిని విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో వినుకొండలో ట్రాక్టరు మట్టి రూ1500లకు చేరింది. దీన్ని ఆసరాగా చేసుకుని అధికార పార్టీ నేత అండతో అనుచరులు మట్టి మాఫియాకు తెరలేపారు. వంద ట్రాక్టర్లతో ప్రతి రోజూ 500 ట్రిప్పులు వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మట్టి ముసుగులో అక్రమార్కులు గుండ్లకమ్మ వాగులోని ఇసుకను కూడా తరలిస్తున్నారని తెలుస్తోంది. అయితే అధికారులతో అక్రమార్కులకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఇక వారు ఆడిందే ఆటగా సాగుతోంది.
Also Read: ఇసుక దందా…రవాణాలోనే ఉందా..