నాగూర్ కర్నూల్లో పబ్లిక్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పబ్లిక్పై ఇష్టమొచ్చినట్లుగా బూతులు తిట్టిన వీడియో ఒకటి సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది. నాగూర్ కర్నూల్లోని రామాలయం వద్ద సమీపంలో కొంత మంది యువకులు నిలబడి ఉన్నారు. అక్కడ నిల్చోని ఉన్న ఒక వ్యక్తిని పట్టుకుని ఒక కానిస్టేబుల్ బండ బూతులు అదేపనిగా తిట్టాడు. ఎందుకు తిడుతున్నారని ఆ యువకుడు ప్రశ్నిస్తున్నా వినకుండా అలానే వరుసబెట్టి విచక్షణ కోల్పోయి తిడుతున్నాడు.
చెప్పడానికి కూడా వీళులేన్నంతగా తన బూతు పురాణం మొదలుపెట్టేశాడు. ఒక పక్క పోలీసు శాఖనేమో తమది ఫ్రెండ్లీ పోలింసింగ్ అని చెప్పుకుంటుంటే మరో పక్క కొంత మంది పోలీసులు మాత్రం ఇలా పబ్లిక్పై బూతులతో విరుచుకుపడటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఆమంచికి పోలీసు వార్నింగ్ : చూస్తూ ఊరుకోం!
యువకుడిపై పచ్చిబూతులు లంకించుకున్న కానిస్టేబుల్ వీరంగం చూడండి :
https://youtu.be/eK5Ak34_1WU











