త్రివిధ దళాల్లో నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన ఈ నూతన విధానాన్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలలో ఆర్మీ అభ్యర్ధులు నిరసనలకు దిగగా.. కొన్ని చోట్ల అవి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.ఈ కొత్త విధానం ద్వారా తమ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని, కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆర్మీ అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కెనరం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలను ఉద్యమంగా చేపట్టాలని, తద్వారా తమ డిమాండ్ ల పరిష్కారం దిశగా పోరాడేందుకు అభ్యర్ధులు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో వారి పోరాటానికి రైతు సంఘాలు కూడా స్పందించాయి. ఈ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 24న దేశవ్యాప్త నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) పిలుపునిచ్చింది. ఎస్‌కేఎం 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన సంఘం సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు నేతలు తెలిపారు.
ఇందులో భాగంగా ఈ నెల 24న అన్ని జిల్లా, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట జరిగే నిరసన ప్రదర్శనలకు యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. భారతీయ కిసాన్ యూనియన్(BKU) కూడా నిరసనల్లో పాల్గొంటుందన్నారు. ఆదేశమేమాలో బీకేయూ కూడా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 30న నిరసనలకు పిలుపునిచ్చింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.