ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ల వైరం రోజురోజుకు ఇంకొంత ఎక్కువగా కనిపిస్తుండడంతో ప్రజల్లోనూ, విశ్లేషకుల్లోనూ కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఇలా జగన్ – షర్మిలకు మధ్య ఇంతలా గ్యాప్ పెరగడానికి మూల కారణం జగన్ భార్య వైఎస్ భారతి రెడ్డి అనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. మెయిన్ విలన్ వైఎస్ భారతి రెడ్డి అని అంటున్నారు. పైగా వైఎస్ షర్మిలపైన ఇప్పుడు సాక్షిలో కథనాలు రావడం కూడా ఆమె పోషిస్తున్న పాత్ర వల్లే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా సాక్షిలో షర్మిల గురించి కవరేజీపై అంతా భారతి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
నిజానికి కుటుంబం ఇలా చీలిపోవడానికి గల కారణం కూడా వదినా మరదళ్ల మధ్య ఆధిపత్య పోరుగా తెలుస్తోంది. అదే అప్పుడు షర్మిల వర్సెస్ భారతి మధ్య ఫైట్ గా మొదలయిందని సమాచారం. ఇప్పుడు బయటికి జగన్ వర్సెస్ షర్మిలగా కనిపిస్తున్నప్పటికీ.. అది తొలుత భారతితోనే మొదలైందని చెబుతారు. 2012 సమయంలో వైఎస్ జగన్ జైలులో పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకం అయిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో జగన్ పాదయాత్రను మొదట విజయమ్మతో ప్రారంభించాలని భావించారు. కానీ, ఆమెకు వయోభారం కారణంగా.. తనకు మోకాళ్ల నొప్పులుఉన్నాయని తెలపడంతో, ఆ వెంటనే భారతిని తెరముందుకు తెచ్చారు. అనూహ్యంగా తాను పాదయాత్ర చేస్తానని షర్మిల పట్టుబట్టిందని అలా షర్మిల అప్పట్లో పాదయాత్ర కొనసాగించారని సమాచారం. అక్కడే షర్మిల, భారతి మధ్య ఫైట్ మొదలయిందని చెబుతున్నారు ఎనలిస్టులు.
సాధారణంగా వదినా ఆడపడుచుల మధ్య బేధాభిప్రాయాలు చాలా ఇళ్లలోనూ ఉంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలంగా ఎంతో గౌరవంగా ఇంటి గుట్టు బయటికి రాకుండా ఉండగా.. ఆయన కాలం చేశాక మాత్రం గొడవలు క్రమంగా పెరిగినట్లుగా చెబుతారు. అలా అంతర్గతంగానే ఉన్న పొరపొచ్చాలు.. వైఎస్ జగన్ జైలులో ఉన్న తర్వాత పాదయాత్ర రూపంలో మరింత పెరిగినట్లుగా ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలిగే వారు చెబుతారు.
అలా పురుడు పోసుకున్న బేధాభిప్రాయాలు షర్మిల భారతి మధ్య మరింత పెరిగిపోయినట్లుగా తెలిసింది. ఆ క్రమంలోనే షర్మిలకు వెళ్లాల్సిన ఆస్తి వాటా కూడా జగన్ ను ఇవ్వనివ్వకుండా భారతి చేశారనే టాక్ కూడా ఉంది. మొత్తానికి షర్మిలకు వైసీపీలో సముచిత స్థానం దక్కకుండా భారతి రెడ్డి వ్యూహం కారణంగానే.. జగన్ అడ్డుకున్నారని చెబుతారు. అలా అగ్ని పర్వతంలా పేలిన ఇంట్లోనే విభేదాలతోనే షర్మిల వారిపై రగిలిపోతూ తెలంగాణ రాజకీయాల్లోకి.. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లోకి వచ్చారని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇప్పుడు జగన్ కు షర్మిలకు మధ్య ప్రత్యక్ష పోరు మొదలు కావడంతో.. షర్మిలపై తన పత్రికలో నెగటివ్ కథనాలు వేయడం ద్వారా భారతి రెడ్డి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.