Film Critic Kathi Mahesh Is No More :
సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ కన్నుమూశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. చెన్నై– కలకత్తా రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మొదట నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స అందించినా పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మహేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
Kathi Mahesh :
స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శనివారం సాయంత్రం కత్తి మహేష్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన స్నేహితులు వెంకట సిద్ధారెడ్డి, మహి దగ్గరుండి మహేష్ కు వైద్య చికిత్సకు సహకరించారు. మహేష్ భార్యా, పిల్లలు లక్నోలో స్థిరపడ్డారు. మహేష్ కొంతకాలంగా వీరికి దూరంగా ఉన్నారు.
వైద్యులు శ్రమించినా ఫలితం లేదు
కత్తి మహేష్ ను బతికించడానికి వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది. అతని వైద్య చికిత్స ఖర్చల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షలు మంజూరు చేసింది. మహేష్ తలకు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మొహంలో ఎముకలు కూడా విరిగిపోయాయి. వీటిని సరిచేయడానికి ఆపరేషన్ కూడా చేశారు. దాదాపు రెండు వారాలుగా చెన్నైలోనే అతనికి వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో డిగ్రీ చేసిన కత్తి మహేష్ ఆ తర్వాత ఫలిం ఇన్ స్టిట్యూట్ లోనూ శిక్షణ తీసుకున్నారు. పలు సినిమాల్లో నటించారు.
ముఖ్యంగా సినిమా విమర్శలు చేయడంలో తనదైన శైలిని ప్రదర్శించేవారు. కాకపోతే అతని వివాదాస్పద కామెంట్ల తో అతని మీద కేసులు కూడా నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ద్వేషించే వాతావరణం నెలకొంది. అనేక టీవీ చర్చల్లో పాల్గొనడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఆ వివాదాల కారణంగానే బిగ్ బాస్ సీజన్ 1లోనే చోటు దక్కినట్టుంది. దాంతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సాధించారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండేవారు.
Must Read ;- అర్ధాంతరంగా ముగిసిన కత్తి మహేష్ జీవితం











