సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నై– కలకత్తా రహదారిపై తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ కు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. మొదట నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స అందించినా పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మహేష్ తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కొద్ది సేపట్లో వైద్య అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆయన స్నేహితులు వెంకట సిద్ధారెడ్డి, మహి దగ్గరుండి మహేష్ కు వైద్య చికిత్సకు సహకరిస్తున్నట్లు సమాచారం. భార్యా, పిల్లలు లక్నోలో స్థిరపడ్డారు. మహేష్ కొంతకాలంగా వీరికి దూరంగా ఉన్నట్లు సమాచారం. మహేష్ కు ప్రమాదం జరిగిన విషయం తెలిసి భార్య పిల్లలతో కలిసి చెన్నైకి బయలుదేరినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో మహేష్ తో పాటు డ్రైవర్ కూడా ఉన్నాట్లు చెబుతున్నారు.
డ్రైవర్ తోపాటు వెనక ఉన్న మరోవ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. కత్తి మహేష్ జీవితం మొదటి నుంచి వివాదాస్పదమే. అనేక టీవీ కార్యక్రమాల్లో చర్చల్లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి కూడా ఆయన గురయ్యారు. కత్తి మహేష్ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమేనని తెలిసింది. వైద్య ఖర్చలను కూడా వెంకట సిద్ధారెడ్డి, మహినే చూసుకుంటున్నారని సమాచారం.











