ఆంధ్రప్రదేశ్ చివరి విడతలో 13 జిల్లాల్లోని 161 మండలాలకు పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటికే 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 2,743 పంచాయతీలలో.. 22,423 వార్డులలో కౌంటింగ్ చేస్తు్న్నారు.
విజయనగంలో అత్యధికంగా 85.60 శాతం పోలింగ్ నమోదైంది. నెల్లూరులో అత్యల్పంగా 73 శాతం పోలింగ్ జరిగినట్లు సమాచారం. ఇక మిగిలిన జిల్లాల పోలింగ్ శాతాలు గమనిస్తే.. శ్రీకాకుళం 78.8, విశాఖ 84, తూర్పు గోదావరి 75, పశ్చిమ గోదావరి 79.03, గుంటూరు 76.7, కృష్ణ 79.2, ప్రకాశం 78, చిత్తూరు 75, కడప 80, అనంతపురం 72, కర్నూలు 76.5 శాతాల కౌంటింగ్ నమోదైంది. కొన్ని చదురు మొదురు ఘటనలు మనహా మిగిలిన పోలింగ్ ప్రశాంతంగా సాగిందని అధికారులు వెల్లడించారు.











