హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ టైర్ల గోదాములో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలు దట్టంగా వ్యాపిస్తుండటంతో సుమారు 15 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే టైర్ల గోదాం పక్కనే, పెట్రోల్ బంక్ కూడా ఉండటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. భారీ అగ్నిప్రమాదంతో చాదర్ ఘాట్, అఫ్జల్ గంజ్ రూట్ లో ట్రాఫిక్ స్తంభించింది. ఇది ప్రధాన రహదారి కావడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతూ, వేరే రూట్లలో వెళ్తున్నారు. నష్టపరిహారం కూడా భారీగా జరిగే అవకాశాలున్నాయి.
Must Read ;- ముంబై కొవిడ్ ఆస్పత్రిలో మంటలు : 9కు చేరిన మృతుల సంఖ్య