ప్రొబేషన్ డిక్లరేషన్ అడిగితే అంతేగా..!!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ విభాగాల్లో ఉన్న కొలువుల్లో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 1.34 లక్షల మంది ఉద్యోగులు నేడు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రొబేషన్ ఖరారు చేయకుండా గత ఏడాది ఆగష్టు నుంచి జగన్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీనిపై ఇప్పటికే ఉద్యోగులు ఆందోళన బాటపట్టినప్పటికీ.. జనవరి 11 న గ్రామ, వార్డు సచివాలయం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సచివాలయాల ఉద్యోగుల సంఘాల తరుఫున చర్చలు జరిపారు. ఈ చర్చలకు సచివాలయం ఉద్యోగుల సంఘాల తరుఫున 20 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నేపధ్యంలో ఉద్యోగులు ఆందోళన వీడాలని ఆయన కోరారు. ఈ క్రమంలో సమస్యకు పరిష్కారం చూపకుండా.. విరమించమంటే ఎలా అని కొంతమంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విభేదించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉన్నతాధికారులు మాట వినే ప్రసక్తే లేదని చెప్పడంతో అజయ్ జైన్ ఆగ్రహించారు.
కొత్త సంఘాల ఏర్పాటు గ్రీన్ సిగ్నల్..
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాలతో అజయ్ జైన్ భేటీ అనంతరం ఉద్యోగుల్లో డివైడ్ అండ్ రూల్ ఫార్ములాను షురు అయినట్లు విమర్శలు లేకపోలేదు. కొన్ని సంఘాలు ప్రభుత్వాదేశాలను బేఖాతరు చేస్తున్నట్లు గ్రహించి, డివైడ్ అండ్ రూల్ ఫార్ములా అప్లైకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అజయ్ జైన్ తో సమావేశం ముగిసిన వారం రోజుల్లోనే అన్ని జిల్లాలో మండల స్థాయి సచివాలయం ఉద్యోగ సంఘాలు పుట్టుకొచ్చాయి. ఇలా ఉన్న ఫలంగా నూతన సంఘాలు పుట్టుకురావడం నేడు ఉద్యోగుల్లో చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఘాలు ధీటుగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉద్యోగులు అనుమానిస్తున్నారు. ఏదీఏమైన ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ప్రొబేషన్ డిక్లెరేషన్ అందించి, ఆదుకోవాలని డిమాండ్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది!