ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు బిగ్‌షాక్ తగిలింది. సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన సంజయ్ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
A-1గా సంజయ్, A-2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా, A-3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థ అధినేతల పేర్లను FIRలో చేర్చారు. దీంతో సంజయ్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
ఐతే సంజయ్‌కి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పీకే మిశ్రా ద్విసభ్య ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాది సంజయ్‌కి మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.
అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సంజయ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ట్యాబ్‌ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, అగ్ని మొబైల్ యాప్‌ను తనకు తెలిసిన సంస్థకు కట్టబెట్టారని అభియోగాలు నమోదయ్యాయి. వేర్వేరు అభియోగాలపై సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.