మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కేకు 127వ నంబర్ దక్కింది. ఇదేంటనుకుంటున్నారా. అవును తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దా*డి కుట్రలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసుల తేల్చారు. దీంతో ఈ కేసులో RKను 127వ నిందితుడిగా చేర్చారు. టీడీపీ ఆఫీస్‌పై దా*డి వెనుక వైసీపీ ముఖ్య నేతలు ఉన్నట్లు ఇప్పటికే తేల్చారు. వీరిలో సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, నందిగం సురేశ్, దేవినేని అవినాశ్‌తో పాటు మరికొందరు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో రామకృష్ణారెడ్డి చేరారు.
రెండు నెలల కిందటే ఆర్కేకు ఈ నెంబర్ దక్కినా బయటకు రానివ్వలేదు. తనను అరెస్టు చేస్తారన్న భయంతో ఆళ్ల కోర్టును ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ ఓడిపోయినప్పటి నుండి ఆర్కే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధికారంలో ఉన్న టైంలో ఆర్కే అక్రమాలకు తెగబడ్డారు. వరదలు వచ్చినప్పుడు..బ్యారేజీ గేట్లను మూసివేసి దగ్గర ఉండి చంద్రబాబు ఇంటిని ముంచాలని ప్రయత్నించారు.
సజ్జల రామకృష్ణారెడ్డిని..బోషడికే అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. బోషడికే అంటే పెద్ద బూతు అని దాన్ని జగన్ ను ఉద్దేశించే అన్నారని చెప్పి టీడీపీ ఆఫీసుపై దా*డికి వైసీపీ రౌడీలను రెచ్చగొట్టారు. దేవినేని అవినాష్ , అప్పిరెడ్డి, ఆర్కే లాంటి వాళ్లు తమ రౌడీ అనుచరుల్ని పంపి టీడీపీ ఆఫీసుపై దా*డి చేయించారు. అప్పట్లో ఈ దా*డికి పోలీసులు సహకరించారు. నామమాత్రంగా కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఐతే టీడీపీ అధికారంలోకి వచ్చాక కేసును మళ్లీ తెరిచింది. చట్టపరంగా ముందుకెళ్తోంది.











