నిత్యం ఎవరో ఒకరిపై సంచలనాత్మక విమర్శలతో విరుచుకుపడడం, ఏదో ఒక విషయంపై ఎప్పుడూ వివాదాలు రేపడం బాలీవుడ్ నటీమణి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు అలవాటు గా మారింది. ఈ క్రమంలో ఆమె పై ఎన్నోసార్లు కేసులు ఫైల్ అయ్యాయి. సమన్లు జారీ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా ఆమెపై ముంబై హై కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసు నిమిత్తం ఆమె ముంబై లోని కోర్ట్ కు హాజరు కావాలి. కానీ ఆమె రాలేదు. దాంతో ఆ కోర్ట్ కంగనాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఆమధ్య ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ పై వివాదాత్మక విమర్శలు చేసింది కంగానా. జావేద్ అఖ్తర్ బాలీవుడ్ సూసైడ్ గ్యాంగ్ లో ఓ సభ్యుడు అనే కామెంట్ చేసింది. అది బాలీవుడ్ లో దుమారం రేపింది. కొంతకాలంగా బాలీవుడ్ నటీనటులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వారిని ఆదిశగా పురిగొల్పేవారిలో జావేద్ కూడా ఒకడని ఆమె అభిప్రాయపడింది. దీంతో జావేద్ లాయర్ కోర్టుకెక్కాడు. ఈ కేసు ను పరిశీలించిన ముంబై కోర్ట్ .. కంగనాకి సమన్లు జారీ చేసింది. దాన్ని ఆమె పట్టించుకోవడంతో .. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీన్ని హైకోర్ట్ లో అప్పీల్ చేస్తామని కంగానా లాయర్ పేర్కొన్నాడు.










