ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి మరో పార్లమెంట్ సభ్యుడు మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహన్ ఈరోజు కరోనాతో మరణించారు. మధ్యప్రదేశ్ నుండి 2006లో ఆయన మొదటిసారి విజయం సాధించారు. అప్పటి నుండి 2009లో మినహా వరుసగా విజయాలు సాధించారు. 2019లో మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నందకుమార్ గత 15 రోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో గత 15 రోజులుగా చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు.
మంచి పార్లమెంటేరియన్: ప్రధాని మోడీ
సుదీర్ఘ కాలం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్న నందకుమార్ సింగ్ చౌహన్ మరణం పట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నందకుమార్ సింగ్ చౌహన్ మంచి పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారని, ప్రజల సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేసాడన్నారు. మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని నందకుమార్ సేవలను మోడీ కొనియాడారు.
Also Read : దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..!











