‘బంగార్రాజు’ పేరును సార్థకం చేసుకుంటున్నాడు. వాసి వాడి తస్సాదియ్యా వీడికి భలే ఆఫర్లు వస్తున్నాయే అనుకుంటున్నారంతా. ఎందుకంటే ఈ సంక్రాంతికి బంగార్రాజే పెద్ద సినిమా. అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలతో కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రీక్వెలో సీక్వెలో గానీ బంగార్రాజు పంట పండేలానే ఉంది. ఈసారి సంక్రాంతి బరిలో బంగార్రాజును ఆటలో అరటి పండులానే అంతా భావించారు. తీరా అది ఇప్పుడు పనసపండులా మారింది. ఒకవేళ ఆ సమయానికి 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా ఆ సినిమా వెనక్కి తగ్గేలా లేదు.
అది కూడా సాధ్యం కాకపోతే మాత్రం ఓటీటీలో విడుదలయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే ఓటీటీ విడుదల వార్తను జీ స్టూడియోస్ కూడా ఖండించింది. బంగార్రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదలవుతుందని అన్నిరు. ఈ సినిమా థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు జీ5 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం బంగార్రాజు సంక్రాంతి రాజుగా కనిపించడంతో బయ్యర్ల నుంచి దీనికి ఫ్యాన్సీ ఆఫర్లు లభిస్తున్నాయి.
సంక్రాంతి అందరికీ శాపంగా మారితే బంగార్రాజుకు మాత్రం వరంగా మారిందనే అనాలి. మరో 10 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. అప్పటికి కరోనా పరిస్థితులు బాగుంటే మాత్రం దీనికి మంచి కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. నాగార్జున కూడా ఈ మధ్య కాలంలో సక్సెస్ కు దూరమయ్యారు. కాలం కలసి వస్తే ఇది మంచి వసూళ్లు సాధించి నాగ్ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది.