‘భీష్మ’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు యువ హీరో నితిన్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. నితిన్ తాజా చిత్రం ‘రంగ్ దే’ ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘చెక్’. దీనికోసం అనేకమంది హీరోయిన్ల పేర్లు వినపడ్డాయి. కాని చివరిగా ప్రియాంక అరుళ్ మోహన్ ను ఫైనల్ చేసారని సమాచారం.
ఇప్పటికే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమా కథను ప్రియాంక కి వినిపించాడని, ఆమె కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, రెగ్యులర్ హీరోయిన్ పాత్రలాగా కాకుండా కథకు చాలా కీలకమైనది అని తెలుస్తోంది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
ఈ సినిమా కథను దర్శకుడు చాలా చక్కగా మలిచాడని నిర్మాతలు తెలిపారు. నితిన్ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందని వారు తెలిపారు. వరుస హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న నితిన్, ఈ సినిమాతో కూడా మంచి విజయం సాధించాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో హీరో నితిన్ మరొక మంచి హిట్ కొడతాడో లేదో చూడాలి మరి.











