రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి రెస్సాన్స్ వస్తోంది. ప్రముఖ సినీ సెలబ్రిటీస్ అందరూ మరొకరు విసిరిసిన ఛాలెంజెస్ ను స్వీకరించి.. మొక్కలు నాటి ఆకట్టుకుంటున్నారు. ఇటీవల సునీల్, రకుల్ ప్రీత్ సింగ్, నభా నటేష్, రామ్ చరణ్ లాంటి వాళ్ళందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటిన సంగతి తెలిసిందే.
ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ విసిరిన ఛాలెంజ్ ను ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ స్వీకరించి వార్తల్లో నిలిచారు. రాజమౌళి, సెంథిల్ కుమార్ తో సహా.. చిత్ర బృందమంతా మొక్కలు నాటి ‘ఆచార్య, పుష్ప, రాధేశ్యామ్’ చిత్ర బృందాలు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రాజమౌళి తన ట్విట్టర్ హ్యాండిల్ లో దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, వివి వినాయక్ , పూరీ జగన్నాథ్ లను ఈ ఛాలెంజ్ లో పొల్గొనవల్సిందిగా కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
My team and I took up the #GreenIndiaChallenge as nominated by @alwaysramcharan… I would like @rgvzoomin, Vinayak garu, @purijagan to take this forward…:)pic.twitter.com/oUeyJo4aEe
— rajamouli ss (@ssrajamouli) November 11, 2020