విశాఖ రిలే నిరాహార దీక్షలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒకే వేదికపైకి మంత్రి అవంతి, మాజీ మంత్రి గంటా వచ్చారు. విశాఖ ఉక్కు పోరాటానికి సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని మంత్రి అవంతి కార్మికులకు పిలుపునిచ్చారు. ఏపీ నాయకులు ఒకరినొకరు విమర్శించుకుంటే లాభం లేదని.. అందరూ కలసి కట్టుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని తెలిపారు.
Must Read ;- గంటా ‘మెగా’ ప్లాన్.. రాజీనామా సూచన ఆయనదేనా?
మాజీ మంత్రి గంటా శ్రీనివాస్, జేఏసీ నాయకుల సమక్షంలో స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు. తను చేసిన రాజీనామాపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లేఖలకు ఢిల్లీ పెద్దల మనసులు కరగవు. అత్యవసర అసెంబ్లీ ఏర్పాటు చేసి వెంటనే తీర్మానం చేయాలి. పార్టీలన్నీ ఒక తాటిపైన నిలిచి పోరాటినపుడే ఫలితం ఉంటుందని ఈ సంధర్భంగా గంటా వ్యాఖ్యానించారు.