భర్త మరణించడమనేది ఏ మహిళకైనా జీవితకాల శిక్షలాంటిది. అంతులేని దుఃఖాన్ని మిగుల్చుతుంది. అటువంటి పరిస్థితుల నుండి తేరుకుని జీవితాన్ని మామూలు గడపడానికే కొందరికి సంవత్సరాలు పడుతుంది. మరికొందరైతే తేరుకోలేనంతగా కుంగుబాటుకు గురవుతారు. కానీ ‘గరిమ’ అలా భావించలేదు. భర్త మరణం ఒకవైపు కుంగదీస్తున్నా.. తన భర్తకు సంబంధించిన బలమైన జ్ఞాపకం కావాలని నిర్ణయించుకుంది. తన భర్త పనిచేస్తూ మరిణించిన భారతీయ వైమానిక దళం తను కూడా ఆఫీసర్‌గా ఎన్నికవ్వాలని నిర్ణయించుకుంది. అర్ధాంతరంగా జరిగిన ప్రమాదంలో మరణించిన తన భర్తకిచ్చే అత్యుత్తమ నివాళిగా భావించింది. అంతేకాదు.. తన భర్తను జీవితకాలం ఒక జ్ఞాపకంలా నిలుపుకోవడానికి ఇదే సరైన మార్గంలా భావించింది గరిమ. మరి అందుకోసం తనెంతగా కష్టపడిందో, తన ప్రయత్నంలో ఎదుర్కోన్న సమస్యలేమిటో మీరు చూడండి..
5 నెలలకే సెలక్షన్ బోర్డుకు ఎన్నికైంది
గరిమ భర్త 2000 సంవత్సరంలో వైమానిక దళంలో చేరారు. దురదృష్టవశాత్తూ.. 2019 ఫిబ్రవరి నెలలో బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ పోర్టులో జరిగిన ఒక విమాన ప్రమాదంలో మరిణించారు. ఇది జరిగిన తర్వాత ఎవరైనా కోలుకోవడానికే నెలల పడుతుంది. కానీ, సంఘటన జరిగిన 5 నెలలకే సర్వీస్ సెలక్షన్ బోర్డుకు ఎన్నికై అందరినీ ఆశ్చర్యపరిచింది గరిమ. భర్తపై ప్రేమను పట్టుదల మార్చుకుని, అతని జ్ఞాపకాలను లక్ష్యంగా చేసుకుని.. అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడంలో మొదటి అడుగువేసింది. ఆ క్షణంలో తన ఆనందానికి అవధులు లేవు. తను ఎంతోగానో ప్రేమించిన తన భర్త పనిచేసిన చోటును చేరుకుంటే తనతో ఉన్నట్లుగా భావించేది గరిమ. అందుకోసమే ఇంతటి ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చింది గరిమ అబ్రాల్.
Must Read ;- ‘మేజర్’ లుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన గూఢచారి
Ms Garima Abrol, now Flying Officer Garima Abrol, wife of late Squadron leader Samir Abrol, who lost his life an Air Accident, passed out from Air Force Academy yesterday.
The real role models of our Nation. @SpokespersonMoD @MinistryWCD @DefenceMinIndia @IAF_MCC pic.twitter.com/ZP34tWBG1q
— PRO Shillong, Ministry of Defence (@proshillong) December 20, 2020
నా కన్నీరు ఇంకా ఇంకలేదు
‘దేశానికి సేవ చేయడానికి కదిలిన ప్రతి క్షణం ఎంతో ప్రేమతో సాగనంపాను. అటువంటి సమీర్ ఇక ఎన్నటకీ ఇంటికి తిరిగిరాడనే విషయం తలుచుకోవడానికి కూడా సాధ్యం కాలేదు. నా కన్నీరు ఇంకలేదు.. తను పనిచేసిన చోటు, తను ఎంతగానో ప్రేమించిన వృత్తి.. అదే ఇకపై నా లక్ష్యం. ఎక్కడ ఉన్నా తను ప్రతిక్షణం నా వెన్నతట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. నేను తను తిరిగిన చోటుకు చేరుకున్న క్షణం నుంచి తను నాతో ఉన్నట్లే అవుతుంది. అంతేకాదు.. సమీర్ అర్ధాంతరంగా వదిలివెళ్లిన లక్ష్యాలను పూర్తిచేయడమే నా జీవితలక్ష్యం.’ ఇలా తన మనసులోని భావనలను ఒకానొక సందర్భంతో అక్షీకరించారు గరిమ.
భారత వైమానిక దళంలోకి అడుగిడిన గరిమ
భర్త మరణాంతరం ఒక లక్ష్యం నిర్ధేశించుకుని పనిచేయడానికి మానసికంగా ఎంతో దృఢంగా ఉండాలి. అప్పుడే శారీరిక దృఢత్వం సాధించగలం. అలా చేయగలిగినపుడే వైమానిక దళం లాంటి ప్రభుత్వ సేవా సంస్థల్లో చోటు సాధించగలం. ఇదంతా వింటుంటేనే ఎంత కష్టం అనిపిస్తుంది కదూ! తనున్న పరిస్థితితో ఇది సాధించగలనా.. ఇంతటి కష్టాన్ని తట్టుకోగలనా అనే విషయాన్ని ఏమాత్రం ఆలోచించలేదు గరిమ. అనుకున్నదే తడవుగా ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువున అదిమిపట్టి కసరత్తులు మొదలుపెట్టింది. వైమానిక దళంలో ఎంపిక కావడానికి కావాల్సిన అర్హతలను సాధించే క్రమంలో ఇవన్నీ తనకు కష్టంగా అనిపించలేదు. పైగా తన భర్త సమీర్ జ్ఞాపకలకి, లక్షాలకి చేరువవుతున్నందుకు ఆనందించింది. తన కలలన్నీ నెరవేరి నేటికి తనను ఆఫీసర్‌గా నియమితురాలవడంతో తన ఆనందానికి అవధులు లేవు. మరి మనం కూడా తన పట్టుదలకు హాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.
భర్త లేకపోతే ఇక జీవితం లేదన్నట్లుగా భావిస్తారు చాలామంది. జీవితం అనుకున్న వ్యక్తి, ఎంతో ప్రేమించిన వ్యక్తి మరణం భరింపరానిదనేది నిజమే అయినా.. గరిమలాగా ఒక లక్షాన్ని నిర్ధేశించుకుని జీవితాన్ని కొనసాగించినపుడే మన జీవితానికి ఒక అర్ధం ఉంటుంది. అర్ధాంతరంగా వెళ్లిపోయిన వారితోనే జీవితం అంతం కాదు.. ఇలా వారి లక్ష్యాలను కొనసాగించడం ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలతో కుంగిపోయి ప్రాణాలు తీసుకునే ఎందరికో గరిమ జీవితం, ప్రయాణం స్ఫూర్తి నింపుతుంది.