26/11 ఉగ్రదాడులు ఇంకా మన కళ్లముందు కదలాడుతునే ఉన్నాయి. ఆ చేదు జ్ఞాపకాలు మనల్ని వీడిపోనేలేదు. ముంబై ఉగ్రదాడులు జరిగి నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న దాదాపు 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్రమంగా ముంబాయిలో చొరబడి మారణకాండను సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ నాడు ఉగ్రవాదులు జరిపిన దాడిని నేటికీ ఎవ్వరూ కూడా మరిచిపోలేదు. కాల్పులు, బాంబు దాడులతో ముంబైలో మారణహోమాన్ని సృష్టించారు. నవంబర్ 26 నుంచి 29 వరకు జీహాదీలు మారణకాండను కొనసాగించారు.
ముష్కరులు చేసిన ఈ దాడిలో దాదాపు 173 మంది మృతిచెందగా మరో 310 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. ముంబై నగరాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు 8 చోట్ల దాడులను జరిపారు. అందులో ప్రధానంగా ఛత్రపతి శివాజీ టెర్మినల్, తాజ్‌మహాల్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ ప్రాంతాలున్నాయి. సముద్రమార్గంగా ఉగ్రవాదులు ముంబై నగరంలో ప్రవేశించి దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదులను మట్టుపెట్టే ఈ పోరులో ముంబై పోలీసులు కొందరు తమ ప్రాణాలను వదిలేసుకున్నారు. పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య సాగుతున్న బీకరపోరులో ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగి ఉగ్రవాది కసబ్‌ను అదుపులోకి తీసుకుని మిగతావారిని మట్టుబెట్టించి మన ఆర్మీ పవర్‌ను పాకిస్తాన్ జీహాదీలకు చూపించారు.
ఉగ్రవాదులు జరిపిన ఈ దాడుల్లో అమరులైన భద్రతా సిబ్బందికి నివాళులర్పించే కార్యక్రమాన్ని ముంబై నగర పోలీసులు ఈ రోజు నిర్వహిస్తున్నారు. సౌత్ ముంబైలోని పోలీసు ప్రధాన కార్యలయంలో కొత్తగా నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, డీజీపీ సుభోద్ కుమార్, ముంబై సీపీ పరమ్‌బీర్ సింగ్ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించనున్నారు.
Must Read ;- హత్రాస్ బాధిత కుటుంబానికి సీఎం యోగి ఇచ్చిన హామీ ఏమైంది?