ఇవాళ ప్రపంచం మొత్తం, జీవితాలు మొత్తం గూగుల్ మయం. మన బతుకులు గూగులైజ్ అయిపోయాయి. గూగుల్ లేకపోతే జీవితం లేదు అన్నట్లుగా దైనందిన జీవితంలో అనేకానేక వ్యవహారాలు అమరిపోయాయి. గూగుల్ కాసేపు లేకపోతే ఏమవుతుంది? ఆ సంగతి సోమవారం సాయంత్రం యావత్ ప్రపంచానికి అనుభవంలోకి వచ్చింది.
గూగుల్ సర్వర్లు డౌన్ అయ్యాయి. దెబ్బకు ప్రపంచం మొత్తం గతి తప్పింది. అనేక రకాలుగా గూగుల్ మీద ఆధారపడి జీవిస్తున్న వారంతా షాక్ అయ్యారు. జీమెయిల్ పనిచేయడం లేదు. తమ డేటా మొత్తం నిక్షిప్తమై ఉండే గూగుల్ డ్రైవ్, అలాగే యూట్యూబ్ సమస్తం స్తంభించిపోయాయి. గూగుల్ కు సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఆగిపోయినట్లు సమాచారం. గూగుల్ సర్వర్లు డౌన్ అయ్యాయని అందరూ అనుకున్నారు.
దీంతో గూగుల్ అధికారికంగా కూడా వివరణ ఇచ్చుకుంది. సర్వర్లు అప్ డేట్ చేస్తున్నామని, సేవలు వెంటనే పునరుద్ధరిస్తామని గూగుల్ ప్రకటించింది.
Must Read ;- ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా కన్నడ కస్తూరి