యూట్యూబ్.. ఈరోజున జనమంతా ఎక్కువగా గడుపుతున్నది ఇందులోనే. అలాంటి యూట్యూబ్ కు తరచూ సాంకేతిక అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈరోజు కూడా యూట్యూబ్ ఓపెన్ కాకపోవడంతో ఏమైందో జనానికి అర్థం కాలేదు. గత నవంబరులో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రపంచ వ్యాప్తంగా వీడియో కంటెంట్ కోసం వెతికే వేదిక యూట్యూబ్. ఓటీటీ వచ్చినా యూట్యూబ్ హవా కొనసాగుతూనే ఉంది. ఈ ఆన్ లైన్ వీడియో సేవలను యూట్యూబ్ ద్వారా గూగుల్ సంస్థ అందజేస్తోంది.
నవంబరులో కూడా కొద్ది గంటలపాటు ప్రసారాల్లో అంతరాయం ఏర్పడింది. ఈ రోజు కూడా కొద్ది గంటల నుంచి యూట్యూబ్ ఓపెన్ కాకపోవడంతో యూట్యూబ్ యూజర్లు గందర గోళానికి గురయ్యారు. గూగుల్ సెర్చ్ లో కూడా యూట్యూబ్ కోసం వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇది సాంకేతిక సమస్య వల్ల ఏర్పడిందని తెలియడానికి యూజర్లకు కొంత సమయం పట్టింది.
ఇది తమకు మాత్రమే అని కొందరు అనుకున్నప్పటికీ ఎక్కడ ఓపెన్ కావడం లేదని అర్థమైంది. మొబైల్ యూజర్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు. సాధారణంగా ఆన్ లైన్ ప్రోగ్రామ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ రోజు ఈ అవాంతరం వల్ల వీడియోలు అప్ లోడ్ చేసేవారు, చూసేవారు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.
Must Read ;- బైడెన్, ఆర్నాబ్ కోసం తెగ గూగల్ చేశారట జనాలు











