ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ కు గూగుల్ డూడుల్ లభించింది. ఈ గురువారం గూగుల్ డూడుల్ ఆయనదే. సెలబ్రిటీలను ఎంపిక చేసి వారి డూడుల్ ను విడుదల చేయడాన్ని గూగుల్ ఆనవాయితీగా పెట్టుకుంది. ఆ గౌరవం ఈసారి ఆర్థర్ లూయీస్ కు లభించింది. వివిధ సెలబ్రిటీలను ఎంపిక చేసి ఇలా డూడుల్ విడుదల చేయడాన్ని గూగుల్ సంప్రదాయంగా పెట్టుకుంది. ఆర్థర్ లూయీస్ సెయింట్ లూసియాన్ ఆర్థికవేత్త, ఫ్రొఫెసర్, రచయిత కూడా. ఆయన డూడుల్ ను రూపొందించింది ఎవరో తెలుసా మాంచెస్టర్ కు చెందిన కెమిల్లా దీన్ని చిత్రీకరించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రభావితం చేసే ఆర్థిక శక్తులను గ్రహించి మార్గనిర్ధేశం చేయడంలో లూయూస్ విశేష కృషి చేశారు. దాదాపు 41 ఏళ్ల క్రితం ఈ విధంగా ఆయన చేసిన కృషికి నోబుల్ బహుమతి లభించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో ఫ్యాకల్టీ సభ్యుడిగానూ ఆయన పనిచేశారు. బిట్రీష్ మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న మొదటి నల్లజాతీయుడు కూడా లూయిస్ అని చెప్పకతప్పదు. కరేబియన్ ద్వీపమైన సెయింట్ లూసియాలోని కాస్ట్రీస్‌లో జనవరి 23, 1915 లో ఆయన జన్మించారు.
బ్రిటీష్ కాలనీ, లూయిస్ జాతి వివక్షతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ 1932 లో ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను అందుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకునే అవకాశం లభించింది. చివరికి పారిశ్రామిక ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. లూయిస్ అతిత్వరగా అకాడెమియా ర్యాంకులను పొందారు. 33 ఏళ్ల వయసులోనే పూర్తిస్థాయి ప్రొఫెసర్ బాధ్యతలను చేపట్టారు. ఆయన తన నాలెడ్జిని ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి వినియోగించారు. 1954లో తన అనుభవాన్ని క్రోడీకరించి ‘ఎకనమిక్ డెవలప్ మెంట్ విత్ అన్ లిమిటెడ్ సప్లయిస్ ఆఫ్ లేబర్’పై ఓ ఆర్టికల్ రాసి ప్రచురించారు.
ఆఫ్రికా, ఆసియా, కరేబియన్ ప్రభుత్వాలకు సలహాదారుగా తన శక్తియుక్తుల్ని వినియోగించారు. ఆయన తన జీవితకాలంలో సాధించిన విజయాలనను పురస్కరించుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1963 లో లూయిస్ ను అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. జూన్ 15, 199న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో కన్నుమూశారు. ఆయన గౌరవార్థం సెయింట్ లూసియాన్ కమ్యూనిటీ కళాశాల మైదానంలోనే ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేశారు.
Must Read ;- భాగ్యనగరానికి 64 దేశాల రాయబారుల రాక